పేర్ని నానికి ఆర్జీవీ కౌంట‌ర్…ప‌వ‌న్ కు సంపూర్ణేష్ కు తేడా లేన‌ప్పుడు మీకు మీ డ్రైవ‌ర్ కు తేడా లేదా..?

 ఏపీ స‌ర్కార్ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంపై ద‌ర్శ‌కుడు ఆర్జీవీ వ‌రుస ప్ర‌శ్న‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ట్వీట్ట‌ర్ వేధిక‌గా వ‌ర్మ ఏపీ మంత్రి పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ ఈ ప్ర‌శ్న‌లు కురిపించారు. ఇక పేర్ని నాని స‌మాధానం ఇస్తూ…మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ RGV Tweets on AP GOVT మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అంటూ ఆర్జీవికి కౌంట‌ర్ ఇచ్చారు. ఇక ఈ పేర్నినాని ప్ర‌శ్న‌ల‌కు తాజాగా ఆర్జీవి స్పందిస్తూ మ‌ళ్లీ వ‌రుస ట్వీట్ల‌తో తిరిగి ప్ర‌శ్న‌లు కురిపించారు.



ఆర్జీవీ ట్వీట్ల‌లో…. “థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది. నీళ్ళు లేని పరిస్థితి ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ అనుకుంటే మార్కెట్ ఉన్నదే దానికి .. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే లగ్జరీ కార్లు చేసి ఆకర్షిస్తారు తప్పని అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం.

Comments